IND vs BAN: అలరించిన హార్దిక్ పాండ్యా.. బంగ్లాదేశ్ ఎదుట భారీ లక్ష్యం

IND vs BAN: అలరించిన హార్దిక్ పాండ్యా.. బంగ్లాదేశ్ ఎదుట భారీ లక్ష్యం

అంటిగ్వా వేదిక‌గా బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న సూపర్ -8 మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(50 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. మిగిలిన బ్యాటర్లు తలా ఓచేయి జట్టుకు భారీ స్కోర్ అందించారు. మొదట రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో), విరాట్ కోహ్లీ(37; 28 బంతుల్లో) జోడి మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఆ దూకుడును అలానే కొనసాగించారు. 

రెండో బంతికే సూర్య ఔట్

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 71 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. తంజిమ్ హసన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సూర్య ఇద్దరూ బంతి తేడాతో పెవిలియన్ చేరారు. తొలి బంతికి కోహ్లీ క్లీన్‌బౌల్డ్ అవ్వగా.. అదే ఓవర్ మూడో బంతికి సూర్య(6) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో రిషబ్ పంత్(36; 24 బంతుల్లో), శివం దూబే(34; 24 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. పంత్ ఔటయ్యాక.. దూబే, పాండ్యా(50 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు) దూకుడు కనపరిచారు. చివరలో దూబే ఔటైనా.. పాండ్యా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు రాబట్టి.. మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. 

బంగ్లా బౌలర్లలో తాంజిమ్ హసన్ సాకిబ్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీసుకున్నాడు.