ఇవాళ కాదు.. టీమిండియా వచ్చేది రేపు

ఇవాళ కాదు.. టీమిండియా వచ్చేది రేపు


అమెరికాలోని బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా జట్టు రాక.. మరింత ఆలస్యం అవుతుంది. అక్కడ తుఫాన్ కారణంగా ఎయిర్ పోర్టు మూసివేశారు.. సిటీ అంతా అల్లకల్లోలంగా ఉంది. దీంతో నాలుగు రోజులుగా హోటళ్లల్లోనే ఉండిపోయారు మన ఆటగాళ్లు. టీమిండియాను సురక్షితంగా ఇండియాకు తీసుకురావటానికి ప్రత్యేక విమానం పంపించింది బీసీసీఐ. 

ఇండియా నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. ఇప్పటికే బార్బడోస్ లోని గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సాయంత్రం.. అంటే 2024, జూలై 3వ తేదీ సాయంత్రం చేరుకోనున్నట్లు సమాచారం. వాతావరణం అనుకూలించకపోవటంతో ఆలస్యం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. భారత క్రికెట్ జట్టుతోపాటు వారి కుటుంబ సభ్యులు, టీమిండియా సబ్బందితో సహా మొత్తం 70 మంది.. నాలుగు రోజులుగా హోటళ్లలోనే ఉన్నారు. అందరినీ ఒకే విమానంలో ఢిల్లీ తీసుకురావటానికి.. ఇండియా నుంచి ప్రత్యేక విమానం అమెరికా వెళ్లింది. 

వాస్తవం జూలై 3వ తేదీ సాయంత్రానికి ఇండియా రావాల్సి ఉన్నా.. అక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండియా నుంచి వెళ్లిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు.. జూలై 4వ తేదీ సాయంత్రానికి ఇండియా చేరుకుంటుంది.