వరల్డ్ కప్లో సంచలనం.. ఆస్ట్రేలియాను ఓడించిన అఫ్గానిస్థాన్‌

 వరల్డ్ కప్లో సంచలనం..  ఆస్ట్రేలియాను ఓడించిన అఫ్గానిస్థాన్‌

టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌  జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ జట్టు  148 పరుగులు చేసింది.  ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్‌ (51) హాఫ్ సెంచరీలు సాధించారు.149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌట్ చేశారు.  

మ్యాక్స్‌వెల్ (59) రాణించినా మిగితా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు.  గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  దీంతో గ్రూప్‌-1లో భారత్‌ రెండు విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. ఆసీస్, అఫ్గాన్‌ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. 

 ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తరఫున పాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు.  అఫ్గానిస్థాన్‌తో జరిగిన  మ్యాచులో వరుస బంతుల్లో(17.6, 19.1, 19.2) ముగ్గుర్ని ఔట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 WC చరిత్రలో రెండు హ్యాట్రిక్స్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించారు.