T20 ప్రపంచ కప్ 2024లో భాగంగా జరుగిన మ్యాచ్ లో ఉంగాడాపై వెస్టిండీస్ జట్టు రికార్డు విజయం సాధించింది. 2024, జూన్ 9, ఆదివారం గయానాలోని ప్రావిండెన్స్ స్టేడియంలో గ్రూప్ C మ్యాచ్‌లోని ఉగాండా, విండీస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 173/5 స్కోర్ చేసింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండాకు వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ చుక్కలు చూపించాడు. తన అద్భత బౌలింగ్ తో ఉగాండా వెన్ను విరిచాడు.
అతని బౌలింగ్ లో ఎలా ఆడాలో తెలియక.. ఉగాండా బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో ఉగాండా4.4 ఓవర్లలో 19 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ప్లేలోనే సగం వికట్లను కోల్పోవడంతో ఉగాండా చేతులెత్తేసింది. మొదటి ఆరు వికెట్లలో హోసేన్ ఐదు వికెట్లు తీసి ఉగాండా పతనాన్ని శాసించాడు.
నాలుగు ఓవర్లు వేసి 2.8 ఎకానమీ రేట్‌తో హోసేన్.. 5 కీలక వికెట్లు తీసి కేవలం11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతనికి తోడు అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లతో రాణించాడే. అలాగే, ఆండ్రీ రస్సెల్, గుడాకేష్ మోటీ, రొమారియో షెపర్డ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి ఉగాండా తరఫున ఒక్క జుమా మియాగి(13) తప్ప మరెవ్వరూ రెండంకెల స్కోర్‌లను నమోదు చేయలేదు. దీంతో ఉగాండా 12 ఓవర్లలో కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్.. టీ20 ప్రపంచకప్ లో 134 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ అకేల్ హోసేన్ కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.