ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో మరో రికార్డును చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(50 ప్లస్ స్కోర్లు) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం (జూన్ 6) ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్(56).. ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు.
వార్నర్ 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోద చేయగా.. గేల్ 455 ఇన్నింగ్స్‌లలో 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు.ఈ ఏడాది ఆరంభంలో టెస్టులు, వన్డేల నుంచి రిటైరైన వార్నర్ 103 అర్ధసెంచరీలు, ఎనిమిది సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(105) మూడో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్(101) నాలుగో స్థానంలో ఉన్నారు.
టీ20ల్లో అత్యధిక 50+ స్కోర్లు
- డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా): 111(379 ఇన్నింగ్స్‌లు)
- క్రిస్ గేల్ (వెస్టిండీస్): 110(463 ఇన్నింగ్స్‌లు)
- విరాట్ కోహ్లీ(ఇండియా): 105 (391 ఇన్నింగ్స్‌లు)
- బాబర్ ఆజం(పాకిస్తాన్): 101 (300 ఇన్నింగ్స్‌లు)
ఇదే మ్యాచ్‌లో, వార్నర్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను అధిగమించి టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 104 మ్యాచ్‌లలో 33.92 సగటుతో మరియు 141.92 స్ట్రైక్ రేట్‌తో 3,155 పరుగులు చేశాడు. అంతేకాదు, 37 ఏళ్ల ఆసీస్ బ్యాటర్ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరవ ఆటగాడిగా ఉన్నాడు.