టీ20 వరల్డ్ కప్ లో స్కాట్ లాండ్ పై ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టీరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ ఐదు వికెట్లు కోల్పోయి ఇంకో రెండు బంతులుండగా లక్ష్యాన్ని చేధించింది. ఆసిస్ బ్యాటర్లలో టావిస్ హెడ్ 49 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినస్ 9 ఫోర్లు, రెండు సిక్సులతో 59 దంచికొట్టాడు. టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 181 పరుగుల టార్గెట్ ను 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. స్కాట్ లాండ్ బౌలర్లలో మార్క్ వట్ట 2, సఫ్యాన్ షరీఫ్ 2, బ్రాడ్ వీల్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్ లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. స్కాట్ లాండ్ ఓపెనర్ మున్సే 35, బ్రాండన్ మెక్ ముల్లెన్ 60, బెర్రింగ్ టన్ 42, మ్యాథ్యు క్రాస్ 18 పరుగులుతో రాణించారు. ఆసిస్ బౌలర్లలో మాక్స్ వెల్ కు రెండు వికెట్లు, అడమ్ జంపా, అగర్,నథాన్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి. స్కాట్ లాండ్ ఓటమితో ఇంగ్లాండ్ సూపర్ 8కు వెళ్లింది. ఒక వేళ స్కాట్ లాండ్ విజయం సాధించి ఉంటే..ఇంగ్లాండ్ ఇంటిదారిపట్టేది. ఆసిస్ గెలవడంతో ఊపిరిపీల్చుకుంది.
వరల్డ్ కప్ నుంచి స్కాట్ లాండ్ ఇంటి దారిపట్టింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు గెలవగా ఒకటి రద్దయ్యింది. మరో మ్యాచ్ లో ఓటమి పాలై టోర్ని నుంచి ఎలిమెనెట్ అయ్యింది. మరో వైపు ఆసిస్ ఆడిన 4 మ్యాచుల్లో నాలుగు గెలిచి సూపర్ 8 కు దూసుకెళ్లింది.