T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌ కామెంటేటర్స్ లిస్ట్ రిలీజ్.. భారత్ నుంచి ముగ్గురు

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌ కామెంటేటర్స్  లిస్ట్ రిలీజ్.. భారత్ నుంచి ముగ్గురు

టీ 20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ శుక్రవారం (మే 24) కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 40 మంది కామెంటేటర్లు ఈ మెగా టోర్నీకు ఎంపికయ్యారు. ఈ లిస్టులో రవిశాస్త్రి, నాజర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, మెల్ జోన్స్, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్ వంటి ప్రముఖులు ఉన్నారు. భారత్ నుంచి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ లకు కామెంటేటర్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. 

అమెరికన్ వ్యాఖ్యాత జేమ్స్ ఓ'బ్రియన్  కామెంటేటర్ గా అరంగేట్రం చేయనున్నాడు. వన్డే ప్రపంచ కప్ విజేతలు రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, రమీజ్ రాజా, ఇయాన్ మోర్గాన్, టామ్ మూడీ, వసీం అక్రమ్ ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డేల్ స్టెయిన్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ అథర్టన్, వకార్ యూనిస్, సైమన్ డౌల్, షాన్ పొలాక్ లాంటి దిగ్గజాలు కామెంట్రీ బాక్స్ లో సందడి చేయనున్నారు. 

జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 2న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
 
గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా  గ్రూప్‌ 'బి' లో  ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ 'సి' లో తలపడతాయి. గ్రూప్ 'డి' లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాడ్స్, నేపాల్ జట్లతో గ్రూప్ ఆఫ్ డెత్ గా పరిగణిస్తున్నారు.  

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి.