వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం(జూన్ 15) కెనడాతో తలపడుతోంది. అయితే, ఫ్లొరిడాలో భారీ వర్షాల కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు.
తడి ఔట్ ఫీల్డ్ ఉన్న ప్రాంతాలను మైదాన సిబ్బంది పెద్ద పెద్ద మెషిన్ల సహాయంతో ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో 45 నిమిషాలలో అనగా 8 గంటల సమయంలో అంపైర్లు, రిఫరీలు మైదానాన్ని పరిశీలించనున్నారు. ఆ సమయానికి మ్యాచ్ నిర్వహణకు ఫీల్డ్ అనుకూలంగా కనిపిస్తే టాస్, ఆట ప్రారంభ సమయాన్ని ప్రకటిస్తారు. కాగా, శుక్రవారం(జూన్ 14) ఇదే స్టేడియంలో తడి ఔట్ ఫీల్డ్ కారణంగా అమెరికా- ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది.
Three dryers are being used for India's match in Florida today, there was only one used for Pakistan's match yesterday 🇮🇳🔥🔥#tapmad #HojaoADFree #INDvCAN #T20WorldCup pic.twitter.com/GQzyoC7GQ2
— Farid Khan (@_FaridKhan) June 15, 2024
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.
కెనడా: అరోన్ జాన్సన్, నవ్‌నీత్ ధలివల్, పర్గాత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్ కీపర్), దిల్‌ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హెల్గెర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖీ, జెరెమె గోర్డన్.