
టీమిండియా పొట్టి ప్రపంచకప్ ఆటకు సమయం ఆసన్నమైంది. బుధవారం(జూన్ 05) గ్రూప్ `ఎ` లో భాగంగా రోహిత్ సేన.. ఐర్లాండ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్.. భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలేంటి..? ఉచితంగా చూడాలంటే ఎలా..? అనేది తెలుసుకుందాం..
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా మ్యాచ్‌లు జట్టు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1తెలుగుతో పాటు కన్నడ, మళయాళం, తమిళ, భోజ్‌పూర్, హిందీ తదితర భాషల ఛానెళ్లలో లైవ్ వీక్షించవచ్చు. అంతేకాదు వరల్డ్ కప్‌లో భారత జట్టు తలపడే మ్యాచ్‌లు డీడీ స్పోర్ట్స్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
Match Day! 🇮🇳vs🇮🇪
— Doordarshan Sports (@ddsportschannel) June 5, 2024
🏏 #INDvIRE ⏰ 8 PM onwards..
LIVE & Exclusive on DD Sports 📺 (DD Free Dish)#TeamIndia #Cheer4India #T20WorldCup #T20WConDD #Cheer4Bharat pic.twitter.com/DOtwT11Za9
ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై చూడాలనుకునే క్రికెట్ ప్రేమికులు.. డిస్నీ + హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. మొబైల్ వినియోగదారులు హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. యాప్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లన్ని ఫ్రీగా చూసే వీలుంది.
బలంగా రోహిత్ సేన
రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రూపంలో బ్యాటింగ్.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు మన సొంతం. ఇక పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా కీలకం కానున్నాడు. మరోవైపు, ఐర్లాండ్ జట్టును తేలిగ్గా తీసిపారేయలేం. ఐరిష్ ఆటగాళ్లు తమదైన రోజు ఎవరినైన మట్టికరిపించగలరు.
భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.