T20 World Cup 2024: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కీలక మార్పు.. భారత్ తుది జట్టు ఇదే

T20 World Cup 2024: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కీలక మార్పు.. భారత్ తుది జట్టు ఇదే

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు (జూన్ 9) దాయాధి దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా  కనిపిస్తున్న భారత్ ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత  పాకిస్థాన్ ఒత్తిడిలో కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 

కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ 

వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో భారత్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించింది. ముఖ్యంగా బౌలింగ్ లో మనోళ్లు అదరగొట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒక్క మార్పు చేసే అవకాశం లేకపోలేదు. తొలి మ్యాచ్ లో ఒక ఓవర్ కే పరిమితమైన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లోకి తీసుకు రావొచ్చు. కుల్దీప్ యాదవ్ కు పాకిస్థాన్ పై మంచి రికార్డ్ ఉంది. చైనామన్ బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.

పాకిస్థాన్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో విఫలమైన అజామ్ ఖాన్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. అతని స్థానంలో సైమ్ అయూబ్ కు ఛాన్స్ దక్కొచ్చు. విఫలమవుతున్న హారిస్ రౌఫ్ ను పక్కన పెట్టి ఇమాద్ వసీం ను తుది జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు మార్పులు తప్పితే అమెరికాతో ఆడిన జట్టే భారత్ తో బరిలోకి దిగొచ్చు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లైవ్ లో ప్రసారమవుతుంది.     

భారత్ తుది జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే , రవీంద్ర జడేజా , కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ , అర్ష్దీప్ సింగ్

పాకిస్థాన్ తుది జట్టు (అంచనా):
 
మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, సైమ్ షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా