న్యూయార్క్: చిన్న టీమ్ నెదర్లాండ్స్‌పై అతి కష్టంగా గట్టెక్కిన సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. డేవిడ్ మిల్లర్(59 నాటౌట్), ట్రిస్టాన్ స్టబ్స్(33) పోరాటంతో.. శనివారం జరిగిన గ్రూప్–డి లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది.
తొలుత డచ్ టీమ్ 20 ఓవర్లలో 103/9 స్కోరు మాత్రమే చేసింది. సైబ్రాండ్ (40), వాన్‌బీక్ (23) రాణించారు. బార్ట్‌మన్ 4, మార్కో జాన్సెన్, అన్రిచ్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 106/6 స్కోరు చేసి నెగ్గింది. 12 రన్స్‌కే హెండ్రిక్స్(3), డికాక్(0), మార్క్రమ్ (0), క్లాసెన్ (4) ఔటైనా స్టబ్స్ తోడుగా మిల్లర్ జట్టును గెలిపించాడు. అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.