T20 World Cup 2024: పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్

T20 World Cup 2024: పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్

పొరుగు దేశం పాకిస్థాన్ ఏ క్రీడలోనైనా ఇతర జట్లతో తలపడుతుందంటే ఓడిపోవాలని కోరుకుంటాం. ఆఖరికి అసోసియేట్ దేశాలతో తలపడుతున్నా మన మదిలో మెదిలే ఆలోచన.. దాయాది దేశం ఓడిపోవాలనే. అలాంటిది చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ గెలవాలని కోరుకోబోతున్నాం.. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఆ దృశ్యాలు చూడబోతున్నాం. 

మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్‌-ఏలో భాగంగా సోమవారం పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. ఇందులో పాక్ విజయం సాధిస్తే భారత్‌ సెమీస్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. అదే పాక్ ఓడితే మాత్రం టీమిండియా ఇంటిదారి పట్టినట్లే. కివీస్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. 

సెమీస్‌కు ఆసీస్

ప్రస్తుతానికి గ్రూప్‌-ఏలో ఆడిన నాలుగింటిలోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక మిగిలింది ఒక స్తానం మాత్రమే. ఆ ఒక్క స్తానం కోసం.. మూడు జట్లు(న్యూజిలాండ్, పాకిస్థాన్, భారత్) రేసులో ఉన్నాయి. భారత్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో రెండో స్థానంలోఉండగా.. కివీస్‌ 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఇరు జట్ల మధ్య ఉన్న తేడా నెట్‌ రన్‌రేట్‌ మాత్రమే. కివీస్(+0.282) కంటే భారత మహిళా జట్టు (+0.322) కాస్త మెరుగైన స్థితిలోఉంది. ఇదే మనకు కలిసొచ్చే అంశం. 

ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్‌ చేతిలో కివీస్‌ ఓడితే.. భారత్ జట్టు రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. అదే సమయంలో పాక్‌ భారీ తేడాతో విజయం సాధించకూడదని కోరుకోవాలి. ప్రస్తుతం పాక్‌ నెట్‌ రన్‌రేట్‌ (-0.488) మైనస్‌లలో ఉంది. భారీ తేడాతో గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపడి పాక్‌ సెమీస్‌ చేరొచ్చు.

సమీకరణాలు ఇవే..

  • ఉదాహరణకు ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్‌ చేసి 150 పరుగులు చేసిందనుకుందకుంటే, ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 9.1 ఓవర్లలోపు ఛేదించకూడదు. ఒకవేళ చేధిస్తే పాకిస్థాన్ సెమీస్‌ చేరుతుంది. 
  • అదే తొలుత పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేసి 150 పరుగులు చేసిందనుకుంటే.. లక్ష్యాన్ని కివీస్‌ చేధించకూడదు. ఓడిపోవాలి. అదే సమయంలో పాక్‌ 53 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవకూడదు. అలా జరిగినా దాయాది జట్టు మనల్ని వెనక్కి నెట్టి సెమీస్‌ చేరుతుంది. 
  • ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే, ఇరు జట్లకు ఒక్కో పోయిందా వస్తుంది కనుక, సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సెమీస్‌ చేరుతుంది. భారత్, పాక్‌ ఇంటిదారి పడతాయి.
  • ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్‌ జట్లు నాలుగేసి పాయింట్లతో ఉండగా.. పాక్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి.