అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ మహాసమరం మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. శనివారం(జూన్ 1)తో వార్మప్ మ్యాచ్‌లు ముగియనుండగా.. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి అసలు మ్యాచ్‌లు షురూ కానున్నాయి. తొలి మ్యాచ్‌లో అమెరికా.. కెనడాతో తలపడనుంది. ఈ క్రమంలో గత ఎడిషన్లలో విజేతగా నిలిచిన జట్లేవి అన్నది తెలుసుకుందాం..
2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ జరగ్గా.. మహేంద్ర సింగ్ సారథ్యంలోని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అప్పటినుంచి గతేడాది వరకూ ఎనిమిది ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇందులో గరిష్టంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్టు రెండు సార్లు చొప్పున ట్రోఫీ చేజిక్కించుకోగా.. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఒక్కొక్కసారి విజేతగా నిలిచాయి.
టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్లు
- 2007: భారత్ (పాకిస్థాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం)
- 2009: పాకిస్థాన్ (శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపు)
- 2010: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై 7 వికెట్లతో విజయం)
- 2012: వెస్టిండీస్ (శ్రీలంకపై 36 పరుగుల తేడాతో గెలుపు)
- 2014: శ్రీలంక (ఇండియాపై 6 వికెట్ల తేడాతో విజయం)
- 2016: వెస్టిండీస్ (ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం)
- 2021: ఆస్ట్రేలియా (న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు)
- 2022: ఇంగ్లాండ్ (పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం)
Take a look at the T20 World Cup winners over the years👇
— OneCricket (@OneCricketApp) May 30, 2024
2007 - India 🇮🇳 pic.twitter.com/faavyHabtZ