టీ20 ప్రపంచకప్ సమరం కోసం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు అమెరికా బయలుదేరాడు. గురువారం(మే 30) రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి అతను న్యూయార్క్ పయనమయ్యాడు.
రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిష్క్రమించాక కోహ్లీ కొంత విరామం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతితో కుటుంబసభ్యులతో గడిపాడు. చివరకు పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గరపడటంతో అమెరికా ఫ్లైట్ ఎక్కాడు. విరాట్ శుక్రవారం భారత జట్టుతో కలవనున్నాడు. అయితే, జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక వార్మప్ మ్యాచ్‌లో అతను పాల్గొంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఐర్లాండ్‌తో తొలి పోరు
మెన్ ఇన్ బ్లూ జూన్ 4న నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్‌తో తమ ప్రపంచ కప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.
ప్రపంచకప్‌లో భారత జట్టు మ్యాచ్‌లు
- జూన్ 05: ఇండియా vs ఐర్లాండ్ (నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్)
- జూన్ 09: ఇండియా vs పాకిస్తాన్ (నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్)
- జూన్ 12: ఇండియా vs అమెరికా (నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్)
- జూన్ 15: ఇండియా vs కెనడా (సెంట్రల్ బ్రోవార్డ్ స్టేడియం, ఫ్లోరిడా)