ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఐసీసీ చిన్న మార్పు చేసింది. గతంలో ఈ పొట్టి సమరం జూన్ 4 నుండి 30 వరకు ICC పురుషుల T20 ప్రపంచ కప్ జరుగబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఒక రోజు ముందు అనగా జూన్ 3 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుందని ఐసీసీ అధికారికంగా తెలియజేసింది. కరేబియన్‌లోని ఆంటిగ్వా & బార్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ & టొబాగో, USAలోని డల్లాస్, ఫ్లోరిడా మరియు న్యూయార్క్ మ్యాచులకి ఆతిధ్యమివ్వనున్నాయి.
అమెరికాలో T20 ప్రపంచ కప్ ఆడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ "20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఆతిధ్యమిచ్చే ఏడు కరేబియన్ వేదికలను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఇది వెస్టిండీస్ హోస్ట్ చేసే మూడవ ICC సీనియర్ పురుషుల ఈవెంట్. అభిమానులకి ఈ మ్యాచులు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి". అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్,USA ఆతిథ్య దేశాలుగా అడుగుపెడతాయి. ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,భారత్,నెదర్లాండ్స్,న్యూజిలాండ్, పాకిస్తాన్,దక్షిణాఫ్రికా,శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-10లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా అర్హత సాధించాయి. స్కాట్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),ఐర్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్),పాపువా న్యూ గినియా (తూర్పు-ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్),నేపాల్,ఒమన్,కెనడా,ఆఫ్రికా, నమీబియా క్వాలిఫైయర్ మ్యాచ్ ల ద్వారా అర్హత సాధించాయి. ఉగాండా, కెన్యా, జింబాబ్వే, నైజీరియా మిగిలిన ఒక్క స్థానం కోసం పోరాడనున్నాయి.
T20 World Cup 2024 will kick off from 3rd June.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 29, 2023
The Final will be played on 30th June...!!! pic.twitter.com/tiv6gt7n8p