2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. తాజాగా ముగిసిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
2024 టీ20 వరల్డ్ కప్ ముగియడంతో 2026 టీ20 వరల్డ్ కప్ జట్లేవో ఒక క్లారిటీ వచ్చింది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. అలాగే తాజాగా ముగిసిన 2024 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యూఎస్‌ఏ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఈ లిస్టులో ఉన్నాయి.
పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ ఆడనున్నాయి. మిగిలిన 8 స్థానాల కోసం.. యూరప్ క్వాలిఫైయర్స్ నుంచి రెండు టీమ్స్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ నుంచి ఒక టీమ్, అమెరికా క్వాలిఫైయర్స్ నుంచి ఒక టీమ్, ఆసియా క్వాలిఫైయర్స్ నుంచి రెండు టీమ్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ టోర్నీ నుంచి రెండు టీమ్స్ అర్హత సాధిస్తాయి.
With the conclusion of the 2024 #T20WorldCup, 1⃣2⃣ teams are confirmed for the 2026 T20 World Cup, which India and Sri Lanka will host🏆 pic.twitter.com/BupFgn7dBI
— CricTracker (@Cricketracker) July 1, 2024