దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది టీమిండియా. కోహ్లీ 76, అక్షర్ పటేల్ 47, శివం దూబే 27, రోహిత్ శర్మ 9 పరుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన రిషభ్ పంత్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.
ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ (3) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ని చక్కదిద్దేపని పెట్టుకున్నాడు. నిలకడగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదేశారు.
ఈ క్రమంలో హఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్న టైమ్ లో అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక చివర్లో శివమ్ దూబె (27) పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెన్, రబాడ చెరో వికెట్ తీశారు.