న్యూఢిల్లీ : టీ20 వరల్డ్‌కప్ కోసం ఇండియా టీమ్‌ను ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేయనున్నారు. మే 1 కటాఫ్ తేదీ కావడంతో ఆలోపే టీమ్‌ను సెలెక్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే మే 25 వరకు టీమ్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ‘ఐపీఎల్ ఫస్టాఫ్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియాను ఎంపిక చేయొచ్చు. అప్పటి వరకు ప్లేయర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై సెలెక్షన్ కమిటీ ఓ అంచనాకు వస్తుంది.
లీగ్ స్టేజ్ ముగిసిన వెంటనే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాని ప్లేయర్లందరూ వెంటనే న్యూయార్క్ బయలుదేరతారు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కూడా ఇలాగే చేశాం. మిగతా ప్లేయర్లు నాకౌట్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత వెళ్తారు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈసారి మెయిన్ టీమ్‌తో పాటు కొంత మంది స్టాండ్ బై ప్లేయర్లను కూడా యూఎస్‌కు పంపించనున్నారు. ఎవరైనా ప్లేయర్ గాయపడినా, అనుకోని సంఘటనలు తలెత్తినా స్టాండ్ బైలో నుంచి ఆటగాళ్లను తీసుకోనున్నారు. టీమ్‌తో పాటు నలుగురు సెలెక్టర్లు కూడా వెళ్లనున్నారు.