ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. ఇప్పటికే అన్ని జట్లు దాదాపు తమ వరల్డ్ కప్ కప్ జట్లను కూడా ప్రకటించేసాయి. మరో నెల రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఒక న్యూస్ అందరిని షాక్ కు గురి చేస్తుంది. పాకిస్థాన్ టెర్రరిస్టుల నుంచి టీ20 వరల్డ్ కప్ కు ముప్పు పొంచి ఉందనే వార్త ప్రస్తుతం భయాందోళనలకు గురి చేస్తుంది.
నివేదికల ప్రకారం.. కరేబియన్ దీవులకు పాకిస్తాన్ నుండి ముప్పు పొంచి ఉంది. తమ ఎజెండా నెరవేర్పు కోసం హింసను ప్రేరేపించడానికి.. క్రీడా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడానికి IS ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. "ప్రో-ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు క్రీడా కార్యక్రమాలపై హింసను ప్రేరేపించే ప్రచారాలను ప్రారంభించాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్, ISKhorasan (IS-K) నుండి వీడియో సందేశాలు ఉన్నాయి. అయితే వీటి గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెస్టిండీస్ తో పాటు ఐసీసీ హామీ ఇచ్చాయి.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రదాడి ముప్పు ఉన్నందున ఈ మెగా టోర్నీ పాకిస్థాన్ లో జరగడం అనుమానంగా మారింది. పాకిస్థాన్ లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగడం కష్టమేనని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
T20 World Cup 2024 Receives 'Terror Threat' From North Pakistan: Reporthttps://t.co/MuPck8RMCV
— anksan.s (@ankit55589115) May 6, 2024
By NDTV Sports via Dailyhunt
Not a new thing associated with Pakistan @_FaridKhan