మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు మొదలవ్వగా.. జూన్ 2 నుంచి అసలు పోరు షురూ కానుంది. ఆ సమయం దగ్గర పడుతుండగా.. ప్రకృతి బీభత్సం సృష్టించింది. టోర్నడోలు విరుచుకుపడటంతో డల్లాస్‍లోని గ్రాండ్ ప్రైరీ క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది.
టోర్నడోల వల్ల గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. భారీ వర్షం, తీవ్రమైన గాలుల వల్ల మైదానంలో ఏర్పాటు చేసిన ఓ స్క్రీన్ ధ్వంసమవ్వగా.. స్డేడియం పైకప్పు డ్యామేజ్ అయింది. సుమారు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఫలితంగా అమెరికా- బంగ్లాదేశ్ జట్ల మధ్య మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ప్రపంచ కప్‌లో 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న గ్రాండ్ ప్రైరీ స్టేడియం మౌలిక సదుపాయాలు, సౌకర్యాలపై నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. ధ్వంసమైన స్టేడియం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A temporary Big Screen LED TV that was brought into the Grand Prairie Stadium for in-stadium replays and scoreboard graphics for the T20 World Cup is destroyed due to severe thunderstorm + 80 MPH winds ❌
— Cricketangon (@cricketangon) May 28, 2024
Scenes from the #USAvBAN warm-up venue, covered by Peter Della Penna ⚠ pic.twitter.com/6XlA03zwCQ
ఇదే వేదికపై ప్రారంభ మ్యాచ్
వాస్తవానికి గ్రాండ్ ప్రైరీ స్టేడియం వేదికగా జూన్ 2న ఉదయం 6 గంటలకు ప్రారంభ మ్యాచ్ జరగాల్సివుంది. తొలి పోరులో సహ ఆతిథ్య దేశం అమెరికా, కెనడా తలపడనున్నాయి. అనంతరం ఇదే వేదికపై జూన్ 4న నెదర్లాండ్స్ vs నేపాల్, జూన్ 6న అమెరికా vs పాకిస్తాన్, జూన్ 8న నెదర్లాండ్స్ vs నేపాల్ మ్యాచ్‌లు జరగాల్సివుంది. దీంతో నిర్వాహకులు స్టేడియం పునరుద్ధణ పనులు మొదలు పెట్టారు.
also read : T20 World Cup 2024: భయపెడుతున్న అసోసియేట్ జట్లు.. నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి
Tornado effects grand prairie stadium | flood warning have all gone through dallas. One side of the stadium completely destroyed #T20WorldCup #worldcup2024 #T20WorldCup24 pic.twitter.com/gpsHLXxOxC
— Bitta Chahal (@bittachaha) May 28, 2024