టీ9 చాలెంజ్ గోల్ఫ్ మూడో సీజన్ షురూ

టీ9 చాలెంజ్ గోల్ఫ్ మూడో సీజన్ షురూ

హైదరాబాద్, వెలుగు: ఆరో రియల్టీ టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నమెంట్ మూడో సీజన్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌ లో మంగళవారం లాంఛనంగా  ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు, మొత్తంగా  128 గోల్ఫర్లు పోటీ పడుతున్నారు. రౌండ్ రాబిన్, నాకౌట్ ఫార్మాట్‌లో జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపుల్లో బరిలో నిలిచాయి. 

పూల్–ఎలో  నోవోటెల్, ఐరా లయన్స్, టూటరూట్, బంకర్ బస్టర్స్, పూల్–బిలో  కైన్ డైరీ, బాష్ ఆన్, గోల్కొండ గాలంట్ గోల్ఫర్స్, ఫెయిర్వే ఫాల్కన్స్ ఉండగా.. పూల్–సిలో  సెమెట్రిక్స్, లావిస్టా క్రూసేడర్స్, పార్-ఫెక్షనిస్ట్స్, వాంటేజ్ వారియర్స్, పూల్–డిలో ఎఫ్జీ వారియర్స్, శ్రీనిధి డెక్కన్ వారియర్స్, సమ్మర్ స్టార్మ్, ఆరో వారియర్స్ బరిలో నిలిచాయి.  

ప్రారంభోత్సవ కార్యక్రమంలో  టీగోల్ఫ్ ఫౌండేషన్ సీఈఓ ఎన్ఆర్ఎన్ రెడ్డి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వి. చాముండేశ్వరనాథ్,  ఆరో రియాల్టీ మార్కెటింగ్ హెడ్  సిద్ధార్థ్ మాల్ తదితరులు పాల్గొన్నారు.