సెమీఫైనల్లో క్రూసేడర్స్, సిమెట్రిక్స్

సెమీఫైనల్లో  క్రూసేడర్స్, సిమెట్రిక్స్

హైదరాబాద్, వెలుగు: -టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లవిస్టా క్రూసేడర్స్, సిమెట్రిక్స్, బంకర్ బస్టర్స్, టూటోరూట్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లవిస్టా క్రూసేడెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – కైన్ డెయిరీ జట్ల మధ్య మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టై అవ్వగా.. ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి లవిస్టా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టింది. 

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిమెట్రిక్స్ 2.5–-1.5తో ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ఫాల్కన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించింది. - బంకర్ బస్టర్స్– శ్రీనిధి డెక్కన్ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్ల మధ్య క్వార్టర్స్ పోరు కూడా టై అవ్వగా..  ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంకర్ టీమ్ గెలిచి టోర్నీలో ముందంజ వేసింది. టూటోరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.5–1.5 తో సమ్మర్ స్టార్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించి సెమీఫైనల్లో అడుగు పెట్టింది.