
హైదరాబాద్, వెలుగు: ఆరో రియాల్టీ టీ9 చాలెంజ్ గోల్ఫ్ మూడో సీజన్‌లో బంకర్ బస్టర్స్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్– కంట్రీ క్లబ్‌లో శనివారం ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌లో టూటోరూట్‌పై బస్టర్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తుదిపోరులో ఫ్రంట్9, బ్యాక్ 9 హోల్‌లో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలవడంతో ప్లే ఆఫ్ మ్యాచ్ నిర్వహించారు.
డబుల్స్ బెటర్ బాల్ ఫార్మాట్‌లో జరిగిన ప్లే ఆఫ్‌లో మొదటి హోల్ డ్రా అవ్వగా.. రెండో హోల్‌లో టూటోరూట్, మూడో హోల్‌లో బంకర్ బస్టర్స్ నెగ్గాయి. విన్నర్‌ను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించగా.. ఇందులో నెగ్గిన బంకర్ బస్టర్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఆ టీమ్ ప్లేయర్ కె. రాజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. విన్నర్ బస్టర్స్ టీమ్‌కు ట్రోఫీతో పాటు రూ. 8 లక్షల ప్రైజ్‌మనీ లభించింది.