తెలుగులో ప్రముఖ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "ఝుమ్మంది నాదం" సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ తాప్సీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. కానీ రాన్రాను తెలుగు సినిమాలకి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఇటీవలే నటి తాప్సీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, అవాకశాలు వంటి విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో నటించినంత మాత్రాన ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటారని చాలామంది అనుకుంటారాని అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. అలాగే తాను కూడా గతంలో షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, జుడ్వా 2 చిత్రాల్లో నటించినప్పుడు హీరోలతో పోలిస్తే చాలా చిన్నమొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నానని చెప్పుకొచ్చింది.
Also Read :- కాంతార కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని దింపిన రిషబ్ శెట్టి
ఇక హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో దర్శకనిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారని తెలిపింది. ఈ క్రమంలో స్టార్ హీరో సినిమాలో ఆఫర్ ఇస్తున్నప్పుడు రెమ్యూనరేషన్ తో పనేముందని కొందరంటే, మరికొందరు మాత్రం సినిమా మొత్తం హీరోపైనే నడుస్తుంది కాబట్టి హీరోయిన్ కి పెద్దగా పనుండదని దాంతో వారికి తోచినంత ఇచ్చింది తీసుకోవాలంటారని చెప్పుకొచ్చింది. మరికొందరైతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే సింపుల్ గా హీరోయిన్స్ ని మార్చేస్తారని దీంతో హీరోయిన్లు రెమ్యునేషన్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ జోనర్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కాగా ప్రస్తుతం తాప్సీ హిందీలో స్కామ్ 1992 వెబ్ సీరీస్ ఫేమ్ పాత్రిక్ గాంధీ హీరోగా నటిస్తున్న "ఓ లడ్కీ హై కహాన్" సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి అర్షద్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్నాడు.