ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనల వల్ల హైదరాబాద్ లో ఫుడ్ లవర్స్ హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యాని తినాలంటేనే వణికిపోయే పరిస్థితి తలెత్తింది. తరచూ ఎక్కడో ఒక చోట బిర్యానీలో బొద్దింకలు, జెర్రులు వంటివి ప్రత్యక్షమవటం.. వెరసి హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ కే కలంకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ బిర్యాని అనగానే గుర్తొచ్చే టాప్ రెస్టారెంట్స్ లో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి రెస్టారెంట్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ప్లేట్ లో టాబ్లెట్ ప్రత్యక్షమయ్యింది.
Also Read:-మారుతి కార్ల ధరలు పెరుగుతున్నాయి.ఎప్పటినుంచి అంటే..
బిర్యానీలో టాబ్లెట్ రావడంతో యాజమాన్యాన్ని నిలదీసాడు కస్టమర్. యాజమాన్యం కస్టమర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా టాబ్లెట్ తీసేసి తినమంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో చిర్రెత్తిన కస్టమర్ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో వైరల్ అయ్యింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న బావార్చి హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
— Prashanth (@itzmibadboi) December 6, 2024
మొన్న ఆ మధ్య మోమోస్ తిని మహిళ మృతి చెందటం, మరో చోట షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురవ్వటం వంటి సంఘటనలు హైదరాబాద్ వాసులను బయటి ఫుడ్ తలుచుకుంటేనే భయపడే పరిస్థితికి తెచ్చాయి. ఇప్పుడు బావర్చి లాంటి ఫేమస్ హోటల్లో ఇలాంటి సంఘటన జరగడంతో జనాలు హోటళ్ల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.