- ఇదేంటని ప్రశ్నిస్తే ట్యాబ్లెట్ తీసేసి తినాలని నిర్వాహకుల సమాధానం
ముషీరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి హోటల్ బిర్యానీలో ట్యాబ్లెట్ప్రత్యక్షమైంది. శుక్రవారం మధ్యాహ్నం బావర్చికి వచ్చిన కస్టమర్బిర్యానీ తింటుండగా ట్యాబ్లెట్కనిపించింది. ఇదేంటని హోటల్ సిబ్బందిని నిలదీస్తే వారు ట్యాబ్లెట్ తీసేసి తినాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో జరిగిందంతా వీడియో తీసుకున్న కస్టమర్సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకుముందు బావర్చి బిర్యానీలో బల్లి, బొద్దింక, సిగరెట్ పీక, కోడి ఈకలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
పూరీ కర్రీలో ఇనుప తీగ
కాచిగూడ చౌరస్తాలోని స్వీకార్ హోటల్లో పూరి కర్రీలో ఇనుప తీగ వచ్చింది. స్వీకార్హోటల్ లో శుక్రవారం ఉదయం గుండె సంపత్ అనే వ్యక్తి పూరీ తింటున్నాడు. కర్రీలో ఇనుప ముక్కలు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించగా ఏం చేసుకుంటావో చేస్కొమ్మని సమాధానం ఇచ్చారు. దీంతో అంబర్ పేటఫుడ్ఇన్స్పెక్టర్హేమలతకు ఫిర్యాదు చేశాడు.