వరల్డ్ కప్ లో సెమీస్ రేస్ లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ పర్వాలేదనిపించింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. జట్టులో ఏ ఒక్కరు కూడా బాధ్యతగా ఆడకుండా వచ్చిన వారు తలో చేయి వేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌటైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఇమాముల్ (12) తన చెత్త ఫామ్ ను కొనసాగించగా.. అబ్దుల్లా షఫీక్ 9 పరుగులకే పెవియన్ కి చేరాడు. ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ తీసుకున్నారు. మూడో వికెట్ కు 49 పరుగుల తర్వాత 31 పరుగులు చేసి రిజ్వాన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇఫ్తికార్(21) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేదు.
ఇఫ్తికార్ ఔటైన కాసేపటికీ బాబర్ 50 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 5 వికెట్లకు 151 పరుగులతో కష్టాల్లో ఉన్న పాక్ టీంను సౌద్ షకీల్ (52) షాదాబ్ ఖాన్ (43) ఆదుకున్నారు. వీరిద్దరి పాటు నవాజ్ (24) కూడా ఆడడంతో పాక్ 271 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షాంసి 4 వికెట్లు తీసుకోగా, జాన్సెన్ కు మూడు వికెట్లు దక్కాయి. కొయెట్జ్ కు రెండు, ఎంగిడికి ఒక వికెట్ లభించింది.