Puri Jagannadh : పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటి టబు

 Puri Jagannadh : పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటి టబు

నైంటీస్‌‌‌‌లో వచ్చిన ‘కూలీ నెంబర్ వన్‌‌‌‌’ మొదలు ఐదేళ్ల క్రితం వచ్చిన ‘అల వైకుంఠపురములో’ వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీతో టబుకు స్పెషల్‌‌‌‌ బాండింగ్ ఉంది.  చిన్న బ్రేక్ తర్వాత మరోసారి ఆమె తెలుగు సినిమాలో కనిపించబోతోంది.  విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌‌‌‌ దర్శకత్వంలో ఓ పాన్‌‌‌‌ ఇండియా ప్రాజెక్ట్‌‌‌‌ రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. సేతుపతి నెవర్‌‌‌‌‌‌‌‌ బిఫోర్ క్యారెక్టర్‌‌‌‌లో నటించనున్న ఈ చిత్రంలో టబు కూడా నటించబోతోంది. 

కథతో పాటు తను పోషించబోయే పాత్రకు ప్రాధాన్యతనిస్తూ సెలక్టివ్‌‌‌‌గా సినిమాలు చేస్తున్న టబు.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. పూరి కనెక్ట్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. త్వరలోనే ఇతర నటీనటులు టెక్నీషియన్స్‌‌‌‌ వివరాలను ప్రకటించనున్నారు.