ఆర్మూర్ లో..తైక్వాండో బెల్ట్  ​గ్రేడింగ్ ​పోటీలు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లో ఆదివారం తైక్వాండో బె ల్ట్​గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు 110 మంది స్టూడెంట్స్​ హాజరు కాగా ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఎల్లో బెల్ట్​లు ప్రదానం చేశారు. తైక్వాండో జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రాండ్ మాస్టర్ కరాటే భోజన్న ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఆర్మూర్ కు చెందిన ప్రముఖులు ముక్కా సూరజ్ కుమార్, ఎం.రాజన్న, శ్రీనివాస్ పోటీలకు హాజరై స్టూడెంట్స్​కు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.