టఫే వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మి వేణు

టఫే వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా లక్ష్మి వేణు

హైదరాబాద్, వెలుగు: ట్రాక్టర్ల తయారీ కంపెనీ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ లిమిటెడ్ (టఫే) వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ లక్ష్మీ వేణు నియమితులయ్యారు. టఫే  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఆమె ఆటోమొబైల్ భాగాల వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించారని కంపెనీ ప్రకటించింది.  

లక్ష్మి నాయకత్వ నైపుణ్యాలకు గుర్తింపుగా బోర్డు ఆమెను వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమించిందని పేర్కొంది. లక్ష్మి యేల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్.