
తెలుగు ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “తండేల్”. ఈ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగ చైతన్య కి జంటగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి నటించింది. మంచి లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోన లవ్ ట్రాక్ సాంగ్స్ కూడా మంచి ప్లస్ అయ్యాయి. దీంతో రిలీజ్ అయిన రెండు వారాలలోనే రూ.100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొటింది.
Also Read :- మహారాజ్ ఛత్రపతి శివాజీ పాత్రలో కన్నడ స్టార్
అయితే చై ఫ్యాన్స్ తండేల్ మూవీ ఓటిటి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటిటి రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం దాదాపుగా రూ.30 కోట్లు పైగా మేకర్స్ కి చెల్లించినట్లు సమాచారం. అయితే తండేల్ సినిమాకి ప్రస్తుతం థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలకి ఫ్లాప్ టాక్ రావడంతో తండేల్ కి ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటోంది. దీంతో మార్చ్ 7న ఓటిటిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తండేల్ స్టోరీ ఏమిటంటే.?
తండేల్ కథ విషయానికొస్తే... 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్య్సకారులు గుజరాత్‍లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్థాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ భారత్‍కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది.