కోస్గి పట్టణంలో వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి

కోస్గి పట్టణంలో వాలీబాల్  పోటీలకు ఏర్పాట్లు పూర్తి

కోస్గి, వెలుగు: పట్టణంలోని కాలేజీ గ్రౌండ్​లో ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించే 68వ జాతీయ స్థాయి వాలీబాల్  బాలుర ఛాంపియన్​షిప్  పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్  బి శ్రీనివాసులు తెలిపారు. 

ఈ పోటీల్లో పాల్గొనేందుకు శుక్రవారం వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పట్టణానికి చేరుకోగా, వారికి ప్రభుత్వ జూనియర్  కాలేజీలో వసతి కల్పించినట్లు తెలిపారు. పట్టణానికి వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడంతో పట్టణంలో సందడి ప్రారంభమైంది.