ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలి

నర్వ, వెలుగు: పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్​ పెట్టాలని నర్వ తహసీల్దార్​ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దార్  ఆఫీస్​లో వీ6 వెలుగు దినపత్రిక క్యాలెండర్​ను ఆవిష్కరించారు. పత్రికలు ప్రజలకు సమాచారం చేరవేయడంలో కీలకపాత్ర పోస్తున్నాయని పేర్కొన్నారు. 

ఆధారాలతో నిజాలను నిర్భయంగా రాయాలని సూచించారు. వెలుగు దినపత్రిక అనతికాలంలో ప్రజలకు చేరువైందని చెప్పారు. డీటీ శ్రీనివాసులు, ఆర్ఐ మల్లేశ్, జూనియర్  అసిస్టెంట్  బాలరాజు, బాలకృష్ణ, శివనందు, ఆంజనేయులు పాల్గొన్నారు.