- స్లాట్ బుక్ చేసుకున్న పేషెంట్ దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్
హైదరాబాద్ : పైసలు ఇయ్యనిదే పని కాదనే అపవాదు ఉన్న రెవెన్యూ శాఖలో.. ఓ తహసీల్దార్ మానవత్వం చాటుకొని రెవెన్యూ అధికారులకు ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఓ యువతి పేరిట ల్యాండ్ విరాసత్ చేసేందుకు రెవెన్యూ సిబ్బందే 150 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మడిపల్లెకు చెందిన లోకుంట్ల పూజ తల్లిదండ్రులు కొంతకాలం కింద టీబీతో చనిపోయారు. పూజ కూడా ఇదే వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు స్థానికంగా సర్వే నంబర్ 548/7/3/1/1లోని ఎకరంన్నర భూమి వారసత్వంగా వచ్చింది.
తండ్రి పేరిట ఉన్న భూమిని ఆమె పేరిట విరాసత్ చేసేందుకు జిల్లా కలెక్టర్ సక్షేషన్ ఆర్డర్స్ ఇవ్వగా ధరణిలో ఇటీవల ఆమె సక్సేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్‌బుక్ చేసుకుంది. కానీ ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. స్లాట్ప్రకారం జూన్1న తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లలేకపోయింది. విషయం తెలుసుకున్న తొర్రూరు తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్, తొర్రూర్ ఆర్డీవో అనుమతితో హైదరాబాద్ కు తన సిబ్బందితో వచ్చి హాస్పిటల్ లోనే బయోమెట్రిక్ తీసుకుని సక్సేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా అక్కడికక్కడే ఈ– పట్టా జారీ చేశారు.
మరిన్ని వార్తల కోసం : -
డాక్టర్ నిర్లక్ష్యం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్
ఉపాధి హామీతో పేదలకు మేలు