
జైపూర్ (భీమారం), వెలుగు: మహిళలు లేనిదే మానవ సృష్టి లేదని భీమారం ఎస్సై శ్వేత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల లయన్స్ క్లబ్ (గౌతమి) పీఆర్సీ ఉస్క మల్ల పున్నం చందు ఆధ్వర్యంలో మహిళల కోసం భీమారం మండల కేంద్రంలో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఓపెన్ చేశారు. ఎస్సై, కాంగ్రెస్ సీనియర్ నేతలు పొడేటి రవి, చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, యు.శ్రీనివాస్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు అనేక పాత్రలు సమర్థంగా పోషిస్తున్నారని, వారు లేనిదే మానవ సృష్టి లేదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఇన్చార్జి జ్యోతి, లయన్స్ క్లబ్ మెంబర్లు ఎ.శ్రీనివాస్, చంద్రమోహన్ గౌడ్, ఒ.రాజేందర్, వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, యు.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.