చైనాతో యుద్ధమేనా : తైవాన్ ఎన్నికల్లో అధికార పార్టీ మళ్లీ విజయం

తైవాన్ ప్రజలు తమ తదుపరి అధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్ లై చింగ్ తే ను ఎన్నుకున్నారు. వేర్పాటు వాది, సమస్యలు సృష్టించేవాడు లైచింగ్ అని.. అతడిని ఎన్నుకోవద్దని  ప్రత్యర్థి పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. చివరికి వాటన్నింటిని తోసిపుచ్చి లైచింగ్ ను తైవాన్ అధ్యక్షునిగా ఓటర్లు ఎన్నుకున్నారు. 

అయితే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లైచింగ్ విజయంతో తైవాన్ చిరకాల ప్రత్యర్థి చైనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఆల్ రెడీ తైవాన్ స్వతంత్ర దేశమని.. తైవాన్ స్వతంత్ర దేశమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. బీజింగ్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నమని తెలిపాడు.

ఎన్నికలకు ముందు చైనా పదే పదే ప్రమాదకరమైన వేర్పాటు వాదినని  నిందించింది. చర్చలకోసం తాను చేసిన పిలుపులను తిప్పికొట్టిందన్నారు లై చింగ్ . తైవాన్ జలసంధి అంతటా శాంతి నెలకొల్పేందుకు ద్వీపం రక్షణకు పెంపొందించేందుకు తాను కట్టుబడి ఉన్నాని లై చింగ్ చెప్పారు. 

ఇప్పుడు ఏమి జరుగుతుంది ? 

లై అధ్యక్ష పదవికి మందుంజ లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అతని విజయం దాదాపు ఖాయమే. లై చింగ్ విజయం తైవాన్ ను తన స్వంత భూభాగం అని చెప్పుకుంటున్న చైనా  ఆగ్రహానికి గురి అయ్యే లా ఉందని భావిస్తున్నారు. 

చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఇటీవల ఓ ప్రతిజ్ణ చేశాడు. తైవాన్.. చైనాలో భాగమని.. మాతృభూమిని పునరేకీకరణ తప్పక చేస్తామని ప్రకటించారు. ఒకవే పాలక DPP పార్టీ తైవాన్ స్వాతంత్ర్యానికి మొండిగా మద్దతు పలికితే.. తైవాన్ పై వాణిజ్య ఆంక్షలు పెడతామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది. 

చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతాయని భయం? 

చైనా, తైవాన్ కీలక మిత్ర దేశమైన యూఎస్ రెండు ఈ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక సమస్యలను బేరీజు వేస్తూ ఓటర్లను అనుకూల పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకుంటాయిన భావిస్తున్నారు. చైనా సైనిక బెదిరింపులకు వ్యతిరేకంగా తైవాన్ కు అమెరికా గట్టగా మద్దతునిచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని బీజింగ్ ను కోరింది. తైవాన్ లో రాబోయే ప్రెసిడెంట్ పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా ప్రయత్నిం చేఅవకాశం ఉందని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.