తైవాన్ పార్లమెంట్లో ఎంపీలు పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. శుక్రవారం(మే 17) తైవాన్ పార్లమెంట్ రణరంగంగా మారింది.ఉదయం సభ ప్రారంభమైనప్పటినుంచి మధ్యాహ్నం వరకు నినాదాలు, వాద ప్రతివాదాలతో తైవాన్ పార్లమెంటులో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం కొద్దిగా సద్దుమణిగినా తిరిగి మళ్లీ ఇదే పరిస్థితి. కొత్త అధ్యక్షుడు సోమవారం బలనిరూపణకు ముందే పార్లమెంట్ లో ఈ దాడి చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ గొడవెందుకు.. ?
2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత లైచింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే పార్లమెంట్ లో డీపీపీ మెజార్టీని కోల్పోయింది. లైచింగ్ పార్లమెంట్ లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.
ఈ క్రమంలో రాజ్యాంగ విరుద్ధమైన అధికార దుర్వినియోగం అనే బిల్లును డీపీపీ ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. దీంతో ప్రతిపక్షా పార్టీలైన KMT, TPP సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతోపాటు ప్రభుత్వంపై పార్లమెంట్ కు ఎక్కువ పరిశీలన అధికారాలు వంటి సంస్కరణలపై ప్రతిపక్షం డిమాండ్ చేసింది.
2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే డీపీపీ పార్టీ నేత లైచింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆపార్టీ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీ కుమింటాంగ్ (KMT), DPP కంటే ఎక్కువ సీట్లు కలిగి ఉంది. కానీ సొంతంగా మెజారిటీని ఏర్పరచుకోవడానికి సరిపోదు.కాబట్టి తైవాన్ పీపుల్స్ పార్టీ (TPP)తో కలిసి పని చేస్తోంది.
పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసినట్లు భావించే అధికారులను నేరంగా పరిగణించే వివాదాస్పద బిల్లుతో సహా ప్రభుత్వంపై పార్లమెంటుకు ఎక్కువ పరిశీలన అధికారాలు ఇవ్వాలని ప్రతిపక్షం కోరుతోంది.