
హైదరాబాద్, వెలుగు: కొంగర కలాన్ లోని ఎలక్ట్రానిక్ సిటీలో తైవాన్‌కు చెందిన సెరా నెట్‌వర్క్స్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు తైవాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర అధికారుల బృందంతో సంస్థ ప్రతినిధులు శనివారం ఒప్పందం చేసుకున్నారు.
టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో తైవాన్ వెళ్లిన అధికారులతో సెరా నెట్‌వర్క్స్, హైదరాబాద్‌కు చెందిన రెసొల్యూట్ అప్లయెన్సెస్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ రెండు సంస్థలు ఎలక్ట్రానిక్ సిటీలో కేటాయించిన 10 ఎకరాల్లో అత్యాధునిక భారీ డేటా సెంటర్ స్విచ్‌లు, 5జీ టెక్నాలజీ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాలను తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటైతే రాష్ట్రంలో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.