వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయన్న కారణంతో తొండల(Green Iguanas) జాతిని అంతమొందించాలని తైవాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏకంగా లక్షా 20వేల ఇగువానాల(Iguanas)ను చంపాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేక వేటగాళ్ల బృందాలను నియమించారు. ఒక్కొక దానిని చంపినందుకు 15 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 200) వరకు డబ్బు బహుమతిగా ఇస్తున్నారు.
గతేడాది నుంచి ఇప్పటివరకూ దాదాపు 70వేల తొండలను చంపారు. వీటిని మన భాషలో చెప్పాలంటే.. ఊసరవెల్లి (తొండ జాతికి చెందినవి) అని పిలుస్తుంటారు. తైవాన్‌లో ఇగువానాలు(Iguanas) అని పిలవబడే ఇవి పెంపుడు జంతువులుగా ప్రసిద్ధి. ప్రభుత్వ నిర్ణయంతో పెంపుడు జంతువుల్ని చంపలేక చాలా వరకు అడవుల్లో వదిలేస్తున్నారు.
ALSO READ | కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చు..10 వేల ఎకరాల్లో మంటలు..10 వేల ఇళ్లకు ముప్పు
తైవాన్ ఫారెస్ట్రీ అండ్ నేచర్ కన్జర్వేషన్ ఏజెన్సీ ప్రకారం.. తైవాన్ దక్షిణ, మధ్య ప్రాంతాలలో దాదాపు 200,000 ఇగువానాలు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇవి వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
ఒకసారి 80 గుడ్లు..
మగ ఇగువానాలు దాదాపు 2 అడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉంటాయి. ఇవి 20 ఏళ్ల వరకు జీవించగలవు. అదే ఆడ ఇగువానా విషయానికొస్తే.. ఒకసారి 80 నుంచి 100 గుడ్లు పెడతాయి. ఈ లెక్కన వీటి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. అడవుల చుట్టుప్రక్కల ఉన్న పంటలను పూర్తిగా తినేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీటిని చంపాలని వాన్ ప్రభుత్వం నిర్ణయించింది.