న్యూఢిల్లీ: తైవానీస్ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ ఎంఎస్ఐ చెన్నైలో తన మొదటి ప్లాంటును మంగళవారం ప్రారంభించింది. దీని ద్వారా భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, ఎంఎస్ఐ రెండు ల్యాప్‌టాప్ మోడల్స్‘ ఎంఎస్ఐ మోడరన్ 14, ఎంఎస్ఐ థిన్ 15’లను ఇక్కడ తయారు చేస్తామని ప్రకటించింది.
అధిక- పనితీరు గల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా స్థానికంగా తయారయిన పరికరాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఎంఎస్ఐ ప్రకటన పేర్కొంది. భారతదేశంలో తయారైన థిన్ మోడరన్ సిరీస్ ల్యాప్‌టాప్‌ల ధరలు వరుసగా రూ. 73,990, రూ. 52,990 నుంచి మొదలవుతాయి.