తైవాన్ చుట్టూ చైనా ఓడలు, విమానాల మోహరింపు.. ఉద్రిక్త వాతావరణం

తైవాన్ చుట్టూ చైనా ఓడలు, విమానాల మోహరింపు.. ఉద్రిక్త వాతావరణం

తైపీ: తైవాన్ చుట్టూ చైనా ఓడలు, విమానాలను మోహరించింది. దీంతో చైనా సీక్రెట్​ఆర్మీ తైవాన్ చుట్టూ ఏదో చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అది ఏంటన్నది మాత్రం కచ్చితంగా తెలియడం లేదు. గత 24 గంటల్లో పలు నౌకలు, 47 మిలిటరీ విమానాలను గుర్తించామని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అయితే, మునుపటి డ్రిల్స్‌‌‌‌ లా ఎలాంటి లైవ్ ఫైర్ కార్యకలాపాలు జరగలేదని వెల్లడించింది. 

ఈ అంశంపై తైవాన్ లెఫ్టినెంట్ జనరల్ హ్సీహ్ జిహ్-షెంగ్ మాట్లాడుతూ.. శిక్షణ కసరత్తుగా మారుతుందని, కసరత్తు యుద్ధంగా మారవచ్చని పేర్కొన్నారు. తైవాన్‌‌‌‌ను చైనా తన భూభాగంలోనిదేనని ఎప్పటి నుంచి వాదిస్తోంది. అలాగే, ఇతర దేశాలతో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌‌‌‌తో అధికారిక పరస్పర చర్యలను కలిగి ఉన్న స్వీయ-పరిపాలన ద్వీపాన్ని వ్యతిరేకిస్తోంది. 

తైవాన్ ప్రెసిడెంట్ లై గత వారం గ్వామ్‌‌‌‌లో ఉన్నప్పుడు యుఎస్ కాంగ్రెస్ నాయకులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచంలోని చాలా దేశాల వలె యూఎస్.. అధికారికంగా తైవాన్‌‌‌‌ను ఒక దేశంగా గుర్తించనప్పటికీ, దాని రక్షణ కోసం 23 మిలియన్ల జనాభా ఉన్న ద్వీపానికి ఇది అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అని పేర్కొన్నారు. మరో వైపు   చైనా నావికాదళ కార్యకలాపాలు పెరగడం, చైనా తూర్పు తీరంలోని ఏడు జోన్లలో విమాన ఆంక్షల ప్రకటనకు ప్రతిస్పందనగా తైవాన్ సైన్యం సోమవారం ఎమర్జెన్సీ రెస్పాన్స్​సెంటర్​ను ఏర్పాటు చేసింది. బుధవారం వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.