Taj Mahal : టికెట్ల సేల్స్ ఆదాయంలో తాజ్ మహల్ అగ్రస్థానం

Taj Mahal : టికెట్ల సేల్స్ ఆదాయంలో తాజ్ మహల్ అగ్రస్థానం

తాజ్ మహల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ ప్రసిద్ధి కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటి. ప్రేమకు చిహ్నంగా పిలవబడే ఈ తాజ్ మహల్. యమునా నది ఒడ్డున ఉంది. దీనిని చూడటానికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. దేశంలో బెస్ట్ టూరిజం స్పాట్ గా చెప్పుకునే ఈ తాజ్ మహల్..ఆదాయంలోనూ  అగ్రస్థానంలో నిలిచింది.

టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆదాయం ఆర్జిస్తోన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)  కట్టడాల్లో తాజ్ మహల్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   గత ఐదు సంవత్సరాలలో రూ.297 కోట్ల ఆదాయం వచ్చింది. 2020 నుంచి 2024 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం టికెట్ సేల్స్  ఆదాయ ర్యాంకింగ్స్‌లో తాజ్ మహల్ అగ్రస్థానంలో ఉంది.  

 2023–24 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ల అమ్మకాలలో  రూ. 98.7 కోట్ల ఆదాయం వచ్చింది. తాజ్ మహల్ తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట, కుతుబ్ మినార్ ,తమిళనాడులోని మామల్లపురం, కోణార్క్ లోని సన్ టెంపుల్  ఉన్నాయి . ఎర్రకోట టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ.41.3 కోట్లు సంపాదించగా.. కుతుబ్ మినార్ రూ.30.6 కోట్లు సంపాదించింది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ చారిత్రక ప్రదేశంగా స్థానం దక్కించుకుంది.

ప్రస్తుతానికి భారత పౌరులకు తాజ్ మహల్ ఎంట్రీ ఫీజు రూ.50 ఉండగా.. విదేశీ టూరిస్టులకు రూ.1100గా ఉంది. అలాగే సమాధిని సందర్శించాలంటే  అదనంగా రూ.200 టికెట్ ఉంటుంది.