అల్లు అర్జున్ ఫ్యాన్స్పై చర్యలు తీసుకోండి: పోలీసులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు

అల్లు అర్జున్ ఫ్యాన్స్పై చర్యలు తీసుకోండి: పోలీసులకు  ఓయూ జేఏసీ ఫిర్యాదు

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమను చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు బెదిరింపు కాల్స్ మళ్లీ చేస్తే 30 వేల మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఇంటి పై దాడి చేసినందుకు అల్లు అర్జున్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని గత కొన్ని రోజులుగా  బెదరింపు కాల్స్ వస్తున్నాయని, తమను చంపేస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరులు, ఫ్యాన్స్ నుంచి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ ది అని లేదంటే వేల మందితో మరోసారి ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ALSO READ | బాలయ్యతో అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేయనున్న డాకు మహారాజ్ సినిమా టీమ్.