ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని నవనాథ సిద్ధులగుట్టపై హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా పిరమిడ్ ను అక్రమంగా నిర్మించారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హిందూ పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఆర్మూర్ తహసీల్ధార్ గజానన్‌కు కలిసి మెమోరాండం అందజేశారు.
పిరమిడ్ నిర్మాణంలో విగ్రహం లేకుండా హిందూ మనోబావాలను దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు. గుట్టపైన ఏ నిర్మాణం జరిగినా హిందూ ధ్వజం కచ్చితంగా ఉండాలని, విగ్రహం ఉండాలని డిమాండ్ చేశారు. హిందూ సంస్థల ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.