
- వివేక్ వెంకటస్వామిపై ఫేక్‌న్యూస్ ప్రచారం చేసినోళ్లప్లై చర్యలు తీసుకోండి
- పలు పోలీస్స్టేషన్లలో బీజేపీ లీడర్ల ఫిర్యాదు
రామకృష్ణాపూర్/ బెల్లంపల్లి, పెద్దపల్లి, వెలుగు: మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌కమిటీ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిపై సోషల్‌మీడియాలో ఫేక్న్యూస్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు డిమాండ్‌చేశారు. ఈ మేరకు పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్, ధర్మారం, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్పోలీసు స్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు. రామకృష్ణాపూర్లో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మహంకాళీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్లీడర్ఆరుముల్ల పోశం, టౌన్ జనరల్సెక్రటరీ అరిగేల రవీందర్, బీసీ మోర్చా ప్రెసిడెంట్ పాల రాజు తదితరులు, బెల్లంపల్లిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, గొల్లపల్లి ఎంపీటీసీ హరీశ్‌గౌడ్, బీజేపీ బెల్లంపల్లి టౌన్ప్రెసిడెంట్కోడి రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు, పెద్దపల్లిలో మల్లికార్జున్, దుబాసి మల్లేష్, కల్వల సంజీవ్తదితరులు పోలీసులకు కంప్లైంట్చేశారు. వివేక్‌వెంకటస్వామిపై తప్పుడు ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు.