
సిద్దిపేట రూరల్, వెలుగు: ఎల్ఆర్ఎస్ లో ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్గరిమా అగర్వాల్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు ఈ నెల 31 లోగా రాయితీని సద్వినియోగం చేసుకొని, పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. జిల్లాలో ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు.
అంతకుముందు జిల్లాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన భూ భూసేకరణపై అడిషనల్కలెక్టర్అబ్దుల్హమీద్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములు ఎన్నో వెరిపై చేయాలని, అలాగే భూసేకరణ కి సంబంధించి ఎస్టిమేట్ జెనరేట్ చేసి టీజీఐఐసీ అధికారులకు పత్రాలు అందించాలని ఆదేశించారు. ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, డీజీఎం ఉమా మహేశ్వర్, డీఈ జ్యోతి, సర్వే ల్యాండ్ ఏడీ వినయ్ కుమార్, కలక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, ఆయా మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.