ఆర్మూర్, వెలుగు: పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్కీమ్లను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఆర్మూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం ఆర్మూర్ టౌన్ లోని పాత బస్టాండ్ సమీపంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఉదయ్, పాలెపు రాజు, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పులి యుగంధర్, పీర్సింగ్, మహిళా మోర్చా ప్రతినిధులు స్వభావికా గౌడ్, పద్మ, సునీత, నిఖిత, ఐకేపీ టీఎంసీ ఉదయశ్రీ, ఎస్బీఐ మేనేజర్ హర్ష పాల్గొన్నారు.