యూజర్ల ప్రైవసీ, వారి ఖాతాలపై నియంత్రణను పెంచే లక్ష్యంతో వాట్సాప్ (WhatsApp) ఇటీవల రెండు కొత్త ప్రైవసీ (గోప్యతా) ఫీచర్‌లను ప్రారంభించింది. అందులో మొదటి ఫీచర్... తెలియని కాలర్‌ల నుంచి కాల్‌లను ఆటోమేటిక్ గా సైలెన్స్ చేయడానికి యూజర్స్ కు అనుమతిస్తుంది. ప్రైవసీ చెకప్ అని పిలువబడే రెండవ ఫీచర్.. అన్ని ప్రైవసీ సెట్టింగ్‌లను ఒకే చోట నిర్వహించడానికి సమగ్ర కేంద్రంగా పనిచేస్తుంది.
ప్రైవసీ చెకప్ యూజర్స్ కు WhatsAppలో వారి ప్రైవసీ సెట్టింగ్‌లను నిర్వహించడానికి అనుకూలమైన, కేంద్రీకృత పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ ప్రైవసీ సెక్షన్ ను యాక్సెస్ చేయడం ద్వారా యూజర్స్.. వారి ప్రస్తుత ప్రైవసీ సెట్టింగ్‌లను రివ్యూ లేదా అడ్జస్ట్ చేయవచ్చు.
వాట్సాప్ ప్రైవసీ చెకప్ ను యాక్సెస్ చేయడానికి, యూజర్స్ ఈ స్టెప్స్ ను ఫాలో కావచ్చు:
- వాట్సాప్ ను ఓపెన్ చేసి, సెట్టింగ్‌ల మెనూకి వెళ్లండి.
- ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పైభాగంలో ఉన్న ప్రైవసీ చెకప్ బ్యానర్ ఆప్షన్ ను ఎంచుకోండి.
ఈ ప్రైవసీ చెకప్ సెక్షన్ లో మళ్లీ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి.
మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చో ఎంచుకోండి (Choose who can contact you):
యూజర్స్ ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్ లపై పూర్తి నియంత్రణను పొందుతారు. ఈ సెక్షన్ వారిని గ్రూప్స్ ను మేనేజ్ చేయడానికి, తెలియని కాలర్‌లను సైలెంట్ చేయడానికి, నిర్దిష్ట పరిచయాలను బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది.
మీ వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రించండి (Control your personal info):
ఆన్‌లైన్ స్టేటస్, ప్రొఫైల్ ఫోటో విజిబిలిటీ, చివరిగా చూసిన స్టేటస్, రీడ్ రిసీట్ లతో సహా వారి వ్యక్తిగత సమాచారంపై యూజర్స్ నియంత్రణను కలిగి ఉంటారు.
మీ చాట్‌లకు మరింత గోప్యతను జోడించండి (Add more privacy to your chats):
ఈ సెక్షన్ డిఫాల్ట్ మెసేజ్ టైమర్, మెరుగైన చాట్ ప్రైవసీ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ బ్యాకప్‌లను ఎనేబుల్ చేసే సామర్థ్యం వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
మీ ఖాతాకు మరింత రక్షణను జోడించండి (Add more protection to your account):
ఫింగర్ ప్రింట్ లాక్, టూ స్టెప్ వెరిఫికేషన్ వంటి ఆప్షన్ లతో సహా యూజర్స్ వారి ఖాతాల కోసం అదనపు సెక్యూరిటీ మెజర్స్ ను యాక్సెస్ చేయవచ్చు.
ఈ కాంప్రహెన్సివ్ ప్రైవసీ ఫీచర్స్ ను అందించడం ద్వారా, వాట్సాప్ వారి కమ్యూనికేషన్, వ్యక్తిగత డేటాపై, నియంత్రణ, ట్రాన్స్ఫరెన్సీతో యూజర్స్ ను అలర్ట్ గా ఉండేలా చేస్తుంది. ప్రైవసీ చెకింగ్ , కాల్ సైలెన్సింగ్ ఫీచర్‌తో, యూజర్స్ మరింత సురక్షితమైన, (uninterrupted messaging experience) అంతరాయం లేని మెసేజింగ్ అనుభవాన్ని ఆస్వాదిస్తూ ప్రైవసీ ప్రాధాన్యతలను వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవచ్చు.