మంత్రులతో పాటు రైతులనూ విదేశీ పర్యటనకు తీసుకెళ్లండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మంత్రులతో పాటు రైతులనూ విదేశీ పర్యటనకు తీసుకెళ్లండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విదేశీ పర్యటనలకు మంత్రులతో పాటు రైతులనూ తీసుకెళ్లాలని అన్నారు. దీంతో రైతులకు వ్యవసాయంలో నూతన పద్ధతులు, టెక్నాలజీ వినియోగంపై అవగాహన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాళేశ్వరం పనికి రాని ప్రాజెక్టు అని, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును నీళ్ల లో పోశారని ఈ సందర్భంగా విమర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో సిల్ట్ తొలగించాలని అన్నారు. తమది పచ్చ కండువాల ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వమని.. వచ్చే ఎన్నికల్లోనూ  విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు.