బూతు బొమ్మలపై అమెరికా ఫస్ట్ లేడీ సీరియస్.. ఇక నుంచి సోషల్ మీడియా క్లీన్ అవుతుందా..?

బూతు బొమ్మలపై అమెరికా ఫస్ట్ లేడీ సీరియస్.. ఇక నుంచి సోషల్ మీడియా క్లీన్ అవుతుందా..?

డీప్‌ఫేక్ అసభ్యకర కంటెంట్‌‌కు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సెనేట్ కొత్త బిల్లు తీసుకొచ్చింది. టీనేజర్లను ఆన్‌లైన్ వేధింపుల నుండి రక్షించడానికి వీలుగా 'టేక్ ఇట్ డౌన్ యాక్ట్(Take It Down Act)' తీసుకొచ్చింది. 

ఈ బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అనుమతి లేకుండా నిజమైన లేదా AI- రూపొందించిన ఇంటిమేట్ ఇమేజ్‌లను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం నేరం. సదరు పోస్టులను టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు తొలగించవలసి ఉంటుంది. ఈ బిల్లుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా మద్దతు తెలిపింది.

ఈ బిల్లుకు ఓటు వేయాలని శాసనసభ్యులను కోరేందుకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సోమవారం కాపిటల్ హిల్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. డీప్‌ఫేక్‌ హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్‌పై సీరియస్ అయ్యారు. విషపూరిత కంటెంట్ టీనేజర్లకు హానికరంగా మారుతోందని అన్నారు.

ఈ బిల్లు ఇప్పటికే ద్వైపాక్షిక మద్దతుతో సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇక ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది.